by Suryaa Desk | Mon, Nov 25, 2024, 10:37 AM
ఆరోగ్యానికి నిధిగా భావించే జీడిపప్పు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, కాపర్, జింక్, ఐరన్, మాంగనీస్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.జీడిపప్పు తింటే బరువు పెరుగుతారని చాలా మంది నమ్ముతారు. ఈ కారణంగా చాలా మంది జీడిపప్పు తినకుండా ఉంటారు. ఇందులో నిజమెంతుందో ఇక్కడ తెలుసుకుందాం..జీడిపప్పులో ప్రొటీన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తినడం వల్ల గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.అయితే జీడిపప్పు తింటే బరువు పెరుగుతారని చెప్పడం పూర్తిగా తప్పు అంటున్నారు నిపుణులు. జీడిపప్పును పరిమిత పరిమాణంలో తీసుకుంటే, బరువు పెరగదు. పైగా బరువు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అయితే జీడిపప్పు ఎక్కువగా తింటే మాత్రం బరువు పెరుగుతారు. జీడిపప్పులో విటమిన్లు, మెగ్నీషియం వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి. ఇవి గ్లూకోజ్ మెటబాలిజంలో కూడా సహాయపడతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.జీడిపప్పు తినడం వల్ల ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది. తద్వారా బరువును మెయింటైన్ చేస్తుంది. జీడిపప్పు జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి బరువు పెరగకుండా చేస్తుంది.
Latest News