by Suryaa Desk | Mon, Nov 25, 2024, 03:27 PM
విద్యుత్ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ( సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించే విషయంలో చేపట్టిన కార్యక్రమంపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు. పీఎం సూర్య ఘర్, ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ పరికరాల ఏర్పాటుపై సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారి గృహాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటుపై సమీక్ష నిర్వహించిన సీఎం.. అధికారులకు పలు సూచనలు చేశారు. కుసుమ్ పథకం, సోలార్ విలేజ్ అంశాలపైనా సీఎం చర్చించారు. 100 శాతం సోలార్ విద్యుత్ సరఫరాకు కుప్పం నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది.
Latest News