బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీ వాసులకు బ్యాడ్ న్యూస్
 

by Suryaa Desk | Mon, Nov 25, 2024, 07:23 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన రద్దైంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 29న ప్రధాని మోదీ విశాఖలో పర్యటించాల్సి ఉంది. అయితే తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దు అయ్యింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 29న ప్రధానమంత్రి మోదీ విశాఖపట్నానికి రావాల్సి ఉంది. అలాగే ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేశారు. సుమారు లక్ష మందితో బహిరంగ సభకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే అనకాపల్లి జిల్లా పూడిమడకలోని ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌‌కు కూడా ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేయాల్సి ఉంది. వీటితో పాటుగా కొన్ని రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులకు కూడా ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపనలు జరగాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవటంతో ప్రధాని విశాఖ పర్యటన రద్దైంది.


మరోవైపు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో రూ.85 వే కోట్ల పెట్టుబడితో ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 60 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా.. ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఎన్టీపీసీ, ఏపీ జెన్‌కో సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫెసిలిటీగా నిలవనుంది. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూడిమడక వద్ద 1200 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. 600 ఎకరాల్లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం, 300 ఎకరాల్లో ఎలక్ట్రోలైజర్లు, సోలార్ పీవీ, బ్యాటరీ స్టోరేజీల ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మిగిలిన 300 ఎకరాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారు.


ఇక ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులను 2032 నాటికల్లూ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి దశ పనులను మూడేళ్లలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా నవంబర్ 29న ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయించేందుకు షెడ్యూలు కూడా ఖరారైంది. అయితే ఊహించిన విధంగా వాతావరణ మార్పులతో ప్రధాని పర్యటన రద్దైంది. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపన వర్చువల్‌గా చేపడతారా.. మరో తేదీ నిర్ణయిస్తారా అనేది చూడాల్సి ఉంది.

Latest News
Couple arrested for murder of Kerala woman real estate broker Mon, Nov 25, 2024, 05:00 PM
US: Bird flu virus detected in raw milk from dairy farm in California Mon, Nov 25, 2024, 04:59 PM
Lalan Singh's remarks on minority community 'promotes hatred': Tejashwi Yadav Mon, Nov 25, 2024, 04:56 PM
AIIMS adds 2 new MRI machines to provide more efficient & timely radiology diagnosis Mon, Nov 25, 2024, 04:54 PM
Tribal groups agree to 7-day ceasefire after over 65 killed in Pakistan Mon, Nov 25, 2024, 04:53 PM