by Suryaa Desk | Mon, Nov 25, 2024, 07:37 PM
అదానీ నుంచి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు లంచాలు అందాయనే ఆరోపణలు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఈ అంశంపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘలువు స్పందిస్తూ... అదానీ గ్రూప్ నుంచి లంచాలు తీసుకున్నారనే ఆరోపణలపై జగన్ ను ఈడీ ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. ఈ లంచాల వ్యవహారం అతిపెద్ద కుంభకోణమని చెప్పారు. అదానీతో కుమ్మక్కైన జగన్ ప్రజలపై భారం మోపేలా చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీలను ప్రయోగించే ప్రధాని మోదీ... జగన్ ను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. జగన్, అదానీల లావాదేవీలపై లోతుగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లంచాలపై పార్లమెంటులో చర్చించాలని... జేపీసీతో విచారణ జరిపించాలని కోరారు.
Latest News