ఏపీలో పింఛన్ డబ్బులు ఒకరోజు ముందుగానే
 

by Suryaa Desk | Mon, Nov 25, 2024, 08:10 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛన్‌ను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ డబ్బుల్ని పంపిణీ చేస్తోంది. కానీ ఒకటో తేదీన సెలవు అయితే మాత్రం ముందు రోజే పింఛన్ పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ 1 ఆదివారం కావడంతో పింఛన్ డబ్బుల్ని ఒక రోజు ముందుగానే.. అంటే నవంబర్ 30వ తేదీనే పంపిణీ చేయనున్నారు. పింఛన్ తీసుకునేవారు ఈ విషయాన్ని గమనించాలన్నారు అధికారులు.


అంతేకాదు 1వ తేదీ సెలవుగా ఉన్న నెలలో.. రెండో తేదీన మిగతా (పెండింగ్) పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం సూచనలు చేసింది. ఒకవేళ రెండో తేదీన కూడా సెలవు ఉంటే.. ఆ మరుసటి రోజు (3వ తేదీ) పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం తెలిపింది. ప్రతి నెలా 1న సెలవు దినం వస్తే సచివాలయ ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండు నెలలో పింఛన్ తీసుకోకపోతే మూడో నెలలో కలిపి మొత్తం పింఛన్ డబ్బులు (మూడు నెలలు కలిపి) ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ నెల నుంచే ఈ నిబంధనను అమలు చేస్తున్నారు.


ఒకవేళ ఎవరైనా వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోకపోతే వారిని వలసదారులుగా గుర్తించి పింఛన్ రద్దు చేస్తారు. ఒకవేళ వారు మళ్లీ వచ్చి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే మళ్లీ మంజూరు చేస్తారని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు పింఛన్ తీసుకునేవారు చనిపోతే.. ఆ మరుసటి నెల నుంచే భార్యకు పింఛన్ ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చింది. ఒకవేళ పింఛన్ తీసుకునే వ్యక్తి ఆ నెల 15వ తేదీ లోపు మరణించిన వితంతు మహిళకు తదుపరి నెల ఒకటో తేదీనే పింఛన్ మంజూరు చేస్తారు. వీరు అర్హులు ఆధార్‌కార్డు, భర్త మరణ ధ్రువపత్రం, కుల ఆదాయ పత్రాలు అందజేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నారు.


మరోవైపు దివ్యాంగ విద్యార్థులకు కూడా ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. నివాసానికి దూరంగా విద్యా సంస్థల్లో, గురుకులాల్లో, హాస్టల్స్‌లో ఉండి చదువుకునే విద్యార్థులు ప్రతి నెలా సొంత ఊరికి వెళ్లి పింఛన్ తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు వెళ్లాలంటే సెలవు తీసుకోవాలి.. అంతేకాదు వ్యయప్రయాసలు తప్పవు. ఈ విషయాన్ని గమనించిన ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగ విద్యార్థులకు వారి అకౌంట్‌లలోనే డబ్బుల్ని జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.

Latest News
Russia imposes entry ban on 30 British nationals Wed, Nov 27, 2024, 03:43 PM
Cars24's net loss grows 6.4 pc to Rs 498 crore in FY24 Wed, Nov 27, 2024, 03:31 PM
Failure of AstraZeneca's opioid drug trial a major blow for addiction medications: Report Wed, Nov 27, 2024, 03:29 PM
Centre completes auction of 9 coal mines, to yield Rs 1,446 crore annual revenue Wed, Nov 27, 2024, 02:59 PM
Bumrah reclaims top spot as Test bowler, Jaiswal attains career-best 2nd place in batter's list Wed, Nov 27, 2024, 02:53 PM