by Suryaa Desk | Mon, Dec 23, 2024, 02:05 PM
ధనికులే ఆమె టార్గెట్. ఒకరి తర్వాత మరొకరిని పెళ్లి చేసుకుంటూ ఓ మహిళ ఏకంగా రూ.1.25 కోట్లు కాజేసింది. ఉత్తరాఖండ్‌కు చెందిన సీమా అలియాస్ నిక్కీ అనే మహిళ తోడు లేని పురుషులను టార్గెట్ చేసుకునేది. ఒకరిని పెళ్లి చేసుకుని ఆ తరువాత అతడిపై, అతడి కుటుంబంపై కేసులు పెట్టేది. ఇలా ఒకరి తరవాత మరొకరిని పెళ్లి చేసుకుంటూ, వారిపై కేసులు పెడుతూ డబ్బులు దండుకునేది. ఇలా రూ.1.25 కోట్లు దండుకుంది. ఈ క్రమంలో ఆమెను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Latest News