by Suryaa Desk | Mon, Dec 23, 2024, 03:03 PM
ఆహారంలో, జీవన శైలిలో మార్పులతో ఇటీవల మధుమేహం (డయాబెటిస్) బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. చిన్న వయసులోనే షుగర్ వ్యాధికి లోనై మందులు వాడుతున్నవారు ఎందరో. అయితే మధుమేహానికి లోనవడానికి ముందే... అంటే ప్రీడయాబెటిక్ స్థాయిలోనే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటిని గుర్తించి జాగ్రత్త పడితే మంచిదని సూచిస్తున్నారు.శరీరంలో మెడ, బాహుమూలాలు వంటిచోట్ల చర్మం నల్లగా, మందంగా మారుతోందంటే... శరీరంలో ఇన్సూలిన్ రెసిస్టెన్స్ పెరుగుతోందని అర్థం. అంటే ప్రీడయాబెటిక్ స్టేజీ అని నిపుణులు చెబుతున్నారు.మామూలుగా ఎండలో తిరిగినా, ఎక్కువ శారీరక కష్టమో, వ్యాయామమో చేసినా... తీవ్రంగా దాహం వేయడం మామూలే. అలా కాకుండా సాధారణ సమయాల్లో కూడా దాహం వేస్తుంటే... రక్తంలో షుగర్ స్థాయులు ఎక్కువగా ఉంటున్నట్టేనని నిపుణులు వివరిస్తున్నారు.సాధారణం కంటే ఎక్కువగా, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం రక్తంలో షుగర్ స్థాయుల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నయనేదానికి సూచిన అని నిపుణులు చెబుతున్నారు.ఎలాంటి శారీరక శ్రమ లేకున్నా అలసటగా అనిపించడమంటే... మన శరీరం గ్లూకోజ్ ను శక్తిగా మార్చే ప్రక్రియలో తేడా వచ్చినట్టేనని, ఇది ప్రీడయాబెటిక్ స్టేజీయేనని వివరిస్తున్నారు.చిన్న చిన్న గాయాలు కూడా తగ్గిపోవడానికి ఎక్కువ కాలం పడుతోందంటే... తరచూ ఇన్ఫెక్షన్లకు లోనవుతున్నారంటే... రక్తంలో షుగర్ స్థాయులు నియంత్రణలో లేవనే అర్థమని నిపుణులు ఆహార అలవాట్లు, జీవన శైలిలో పెద్దగా మార్పులేమీ లేకున్నా... బరువు తగ్గుతూ పోవడం, లేదా బరువు పెరుగుతూ పోవడం రెండూ కూడా షుగర్ స్థాయుల్లో తేడాలతోనే ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రక్తంలో షుగర్ స్థాయులు నియంత్రణలో లేకపోతే... కళ్లు మసకగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనితోపాటు అర చేతులు, పాదాల్లో తరచూ తిమ్మిర్లు వస్తుంటాయని వివరిస్తున్నారు.పైన చెప్పిన లక్షణాలు కేవలం ప్రీడయాబెటిక్ అనే కాదు... ఇతర వ్యాధులతోనూ ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ లక్షణాలు మాత్రం ఏదో ఒక అనారోగ్యానికి సూచిక అని స్పష్టం చేస్తున్నారు. ఈ లక్షణాలు కనిపించినప్పుడు వైద్యులను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
Latest News