by Suryaa Desk | Mon, Dec 23, 2024, 03:10 PM
మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై రేషన్ బియ్యం కేసు వ్యవహారంపై కృష్ణా ఎస్పీ గంగాధర్ స్పందించారు. ఈ కేసుకు సంబంధించి పేర్నినానికి మరోసారి నోటీసులు ఇస్తామని తెలిపారు. ఇప్పటికి ఒకేసారి నోటీసు ఇచ్చామని.. నోటీసులు ఆయన చూడలేదేమో మళ్ళీ నోటీసులు ఇస్తామని తెలిపారు. రేషన్ బియ్యం మిస్సింగ్‌పై ఇప్పటికే కేసు నమోదు చేశామన్నారు. దీనిపై లోతైన విచారణ జరుగుతోందన్నారు. రికార్డులతో పాటు సీపీయూ సీజ్ చేసి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపామన్నారు. విచారణ త్వరగా పూర్తి చేసి త్వరలోనే కొలిక్కి తెస్తామని వెల్లడించారు. ఎవరికీ కేసు విచారణపై అపోహలు అవసరం లేదు అని ఎస్పీ గంగాధర్ స్పష్టం చేశారు.
Latest News