by Suryaa Desk | Mon, Dec 23, 2024, 03:21 PM
పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదులుతోది. రేపటికి (మంగళవారం) ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఏపీలోని పోర్టులకు అధికారులు మూడో నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.కాగా సముద్రంలో తీవ్ర అల్పపీడనం ప్రయాణం గందరగోళంగా సాగుతోంది. దీంతో దాని కదలికలను అంచనా వేయడం కష్టమవుతోంది. ఆదివారం తీవ్ర అల్పపీడనం సముద్రంలోనే పూర్తిగా బలహీన పడుతుందని మొదట వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే అల్పపీడనం అవశేషాలు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళుతున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు.
Latest News