by Suryaa Desk | Mon, Dec 23, 2024, 03:44 PM
నేడు (సోమవారం) బంగారం ధర భారీగా తగ్గింది నిన్నటితో పొంచి చూస్తే బంగారం ధర నేడు సుమారు వంద రూపాయల వరకు తగ్గింది. నిజానికి ఆల్ టైం రికార్డ్ స్థాయి అయినా 84 వేల రూపాయల కన్నా రూ. 76 వేలకే తులం బంగారం లభించడం ద్వారా ప్రస్తుతం బంగారం ధర రికార్డు స్థాయి నుంచి తగ్గుదల స్థాయికి ఎందుకు దిగజారిందో తెలుసుకోవచ్చు.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,611 పలుకుతోంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగా రం ధర రూ. 70990 పలుకుతోంది. బంగారం ధరలు తగ్గడానికి ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణం అని చెప్పవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులు అని చెప్పవచ్చు. ముఖ్యంగా బంగారం ధర డాలర్ విలువ పెరిగినప్పుడల్లా తగ్గుతూ ఉంటుంది. ప్రస్తుతం డాలర్ విలువ చరిత్రలోనే గరిష్టంగా 85 రూపాయలు దాటింది. ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.
బంగారం ధర తగ్గడానికి మరో కారణం ప్రధానంగా అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన అనంతరం రక్షణాత్మక వ్యవహార శైలి తీసుకుని అవకాశం ఉంది. దీంతో స్టాక్ మార్కెట్లో పాజిటివ్‌గా స్పందిస్తాయి ఇది కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక కారణం అని చెప్పవచ్చు. చైనా సెంట్రల్ బ్యాంకు లాంటి కీలక సెంట్రల్ బ్యాంకులు ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయడానికి తగ్గించాయి. ఇది కూడా ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధర తగ్గడానికి ఒక కారణం అని చెప్పవచ్చు. డిమాండ్ తగ్గడం వల్ల కూడా బంగారం ధర తగ్గుతుందని చూడవచ్చు. అమెరికాలో కీలకమైనటువంటి సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను సుమారు పావు శాతం మేర తగ్గించించింది. ఈ నేపథయంలో బంగారం ధరలు కూడా పతనం అవుతున్నాయి.
Latest News