by Suryaa Desk | Mon, Dec 23, 2024, 04:11 PM
నిన్నటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర నైరుతిబంగాళాఖాత ప్రాంతమైన ఉత్తర తమిళనాడు & దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో బాగా గుర్తించబడిన అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా కదిలి డిసెంబర్ 23, 2024, 08.30 గంటలకు నైరుతి బంగాళాఖాతం, పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర తీరంలో కొనసాగుతూ, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదిలి డిసెంబర్ 24 నాటికి, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంలో ఉన్న నైరుతి బంగాళాఖాతంలోనే కొనసాగే అవకాశం ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి.
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది
Latest News