by Suryaa Desk | Mon, Dec 23, 2024, 04:22 PM
చేవెళ్ల మండల పరిధిలోని కందవాడ గ్రామంలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం హనుమాన్ జయంతి ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారి పల్లకీ సేవను పురవీధుల గుండా భజన సంకీర్తనలతో చేపట్టారు. ఈ పల్లకీ సేవలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరెందర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కేఎస్ రత్నం, స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. అంతకు ముందు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ.. ఆరాధన సేవకు నిలువెత్తు సాక్ష్యం హనుమంతుడు అని కొనియాడారు. హనుమంతుడి ధైర్యం, వీరత్వం, మానవత్వం, బలం, జ్ఞానం, భక్తి వంటి లక్షణాలు నేటి యువతరానికి ఆదర్శనీయమన్నారు. స్వామి వారి కృప ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్ రెడ్డి, కందవాడ బీజేపీ నాయకులు గౌండ్ల కృష్ణ గౌడ్, శేరి రంగారెడ్డి, మల్గారి భుజంగా రెడ్డి, శేరీ బాల్ రెడ్డి, గుర్రాల శ్రీపాల్ రెడ్డి, కేశపల్లి మహేందర్ రెడ్డి, గుర్రాల మహేశ్వర్ రెడ్డి, జీ రవీందర్ గౌడ్, జీ శేఖర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.