by Suryaa Desk | Mon, Dec 23, 2024, 04:34 PM
అమరావతి నిర్మాణం పూర్తిపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. రాజధానిపై ఎవరెంత దుష్ప్రచారం చేసినా మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.
పోర్టులు ఉన్న ప్రాంతాల్లో శాటిలైట్ సిటీలు నిర్మిస్తామని, ఇందుకు అమరావతి తరహాలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు సేకరిస్తామని తెలిపారు. మానుఫాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ పరిశ్రమలతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు.