by Suryaa Desk | Mon, Dec 23, 2024, 05:41 PM
జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం మల్లన్న పేట గ్రామంలో జరుగుతున్న దొంగ మల్లన్న స్వామి వారి జాతర సందర్భంగా స్వామి వారిని ఆదివారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం దేవాలయంలో తులాభారంలో పాల్గొని నిలువెత్తు బంగారాన్ని సమర్పించి,ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి,ఏఎంసి చైర్మన్ భీమ సంతోష్, మాజీ సర్పంచ్ రేవల్ల సత్యనారాయణ గౌడ్,నాయకులు తాడూరి సత్తన్న,తదితరులు పాల్గొన్నారు.