by Suryaa Desk | Mon, Dec 23, 2024, 05:53 PM
ఐదేళ్ల వైసీపీ పాలనలో తమపై అక్రమ కేసులు పెట్టారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అధికారం కోల్పోయినా వైసీపీ తీరు మారలేదని ఆయన ఫైర్ అయ్యారు.
పలాసలో సుపారీ గ్యాంగ్ ద్వారా నాగరాజును హత్య చేయాలని ఆలోచించటం దారుణమన్నారు. దీని వెనుక సూత్రధారులు ఎవరో తేల్చమని పోలీసులను కోరానని తెలిపారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని మంత్రి అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు.