by Suryaa Desk | Tue, Dec 24, 2024, 10:31 AM
శ్రీకాకుళానికి చెందిన మురపాల అనూష నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ మొదటి ఏడాది చదువుతున్నారు. ఆమెకు హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం అందించేందుకు సాయం చేయాలని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి తన బృందం ద్వారా అవసరమైన వైద్యం నిమిత్తం సోమవారం ఆర్థిక సాయం అందించారు.
Latest News