by Suryaa Desk | Tue, Dec 24, 2024, 11:36 AM
నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని, దీనికి కూడా చట్టబద్ధత తెస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గిపోయిందన్నారు. దాంతో వారు 16,500 పదవులకు దూరమయ్యారని గుర్తు చేశారు.రాష్ట్రంలో పెన్షన్లు పొందుతున్న దివ్యాంగుల్లో పలువురు అనర్హులు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్న సంగతి తెలిసిందే. అర్హులందరికీ పెన్షన్లు, పథకాలు అందాలన్నదే తమ ఉద్దేశమని, అనర్హులకు ఇవ్వడం సరికాద ని ఈ సందర్భంగా అన్నారు. ఎవరు అర్హులు, ఎవరు కాదో తేలాలంటే నిర్దిష్ట నిబంధనలు అమలు కావాలన్నారు. అనర్హులను తొలగించేందు కు పూర్తిస్థాయిలో పింఛన్ల తనిఖీ చేపట్టాలని ఆదేశించారు. పింఛన్ల తనిఖీని కొందరు తొలగింపు కార్యక్రమమంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీనిపై అర్హులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని సీఎం భరోసా ఇచ్చారు. 3 నెలల్లో దివ్యాంగుల పింఛన్లపై తనిఖీలు పూర్తి చేయాలన్నారు. తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చే వైద్యులు, అధికారులు, సిబ్బందిపై చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. తప్పుడు సర్టిఫికెట్ ఇస్తే.. ఎప్పటికైనా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Latest News