by Suryaa Desk | Tue, Dec 24, 2024, 01:12 PM
గుంటూరు నగరంలోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో ‘విద్యుత్ చార్జీల బాదుడుపై వైయస్ఆర్‌సీపీ పోరుబాట’ పేరుతో పోస్టర్‌ను జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, నూరి ఫాతిమాలు ఆవిష్కరించారు.
అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఈనెల 27న రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నాం. ఆరు నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. వైయస్ఆర్‌సీపీ పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచారని తాము అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచమని చెప్పారు. ఛార్జీలు తగ్గిస్తామన్నారు. కానీ భారీ మొత్తంగా విద్యుత్ ఛార్జీలు పెంచారు. రెండు నెలల్లో రూ. 15484 కోట్ల భారం మోపారు. కూటమి నేతలకు రాష్ట్ర ప్రజలకు శఠగోపం పెట్టారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం, ఎన్నికలకు ముందు హమీలివ్వడం.. ఆ తర్వాత వాటిని మర్చిపోవడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు.
Latest News