by Suryaa Desk | Tue, Dec 24, 2024, 01:14 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలకడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎల్లో మీడియా మరోసారి చంద్రబాబు కళ్ళలో ఆనందం కోసం వైయస్ జగన్ పై విషం చిమ్ముతూ ఈ రోజు ఓ అబద్దపు కథనాన్ని వండి వార్చిందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రాపకం కోసం ఎల్లో మీడియా రోజూ ఏదో ఒక అబద్దపు కధనాన్ని తమ పత్రికల్లో వండి వార్చడం పరిపాటిగా మారిందని అన్నారు. దానిలో భాగంగానే తాజాగా, పచ్చి అబద్ధాన్ని వల్లె వేస్తూ… వైయస్ జగన్ గారి భద్రతకు ఏటా రూ.90 కోట్లు ఖర్చు చేసినట్లు ఈరోజు ఈనాడు విష కథనాన్ని ప్రచురించిందని ధ్వజమెత్తారు.
Latest News