by Suryaa Desk | Tue, Dec 24, 2024, 02:56 PM
జనవరి 10 నుంచి 19వ తేదీల మధ్య వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే భక్తులు https://ttdevasthanams.ap.gov.in/home/dashboard ఈ లింక్ క్లిక్ చేసి లేటెస్ట్ అప్‌డేట్‌లో వైకుంఠ ద్వార దర్శనం కోసం రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆప్షన్ వద్ద క్లిక్ చేసి ఫోన్ నెంబర్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేస్తే టికెట్ల బుకింగ్ పేజీ ఓపెన్ అవుతుంది.
జనవరి 10 నుంచి 19 వ తేదీ మధ్య మీరు దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీని క్లిక్ చేసి ఆ తేదీలో ఖాళీలు ఉంటే పేర్లు ఎంటర్ చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. గరిష్టంగా ఒక లాగిన్ మీద ఆరుగురు భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో చెల్లింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తయి, చెల్లింపు చేసిన సమయానికి మీరు కోరుకున్న తేదీ, సమయంలో స్లాట్స్ ఖాళీగా ఉంటే దర్శనం టికెట్ బుక్ అవుతుంది.
Latest News