by Suryaa Desk | Tue, Dec 24, 2024, 02:59 PM
ఏపీసచివాలయంలో ఎస్ఐపీసీ సమావేశం సోమవారం జరిగింది. సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ(ఎస్ఐపీసీ)సమావేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీలు, సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై కమిటీలో చర్చించారు.ఈ ప్రతిపాదనలకు తదుపరి ఆమోదం నిమిత్తం ఎస్ఐపీబీకి సిఫార్సు చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ ట్రాకర్ అంశాన్ని అధికారులతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు.
పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉపాధి కల్పనా యూనిట్లను పర్యవేక్షించాలని ఆయా శాఖలను సీఎస్ ఆదేశించారు. జిల్లా స్థాయిలో సంబంధిత శాఖాధిపతి సహాయంతో జీఎండీఐసీ, రాష్ట్ర స్థాయిలో శాఖాధిపతులు యూనిట్ల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. 2వేల మందికి ఉపాధి కల్పించే యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి టీసీఎస్ చేసిన ప్రతిపాదనకు ఎస్ఐపీబీకి సిఫార్సు చేశారు. రూ. 65 వేల కోట్లతో వివిధ జిల్లాల్లో 500 యూనిట్ల ఏర్పాటుకు రిలయన్స్ చేసిన ప్రతిపాదనకు కూడా ఎస్ఐపీబీకి సిఫార్సు చేశారు.
Latest News