by Suryaa Desk | Tue, Dec 24, 2024, 03:10 PM
మద్యం మత్తులో భార్యపై భర్త కత్తితో దాడి చేసిన సంఘటన హుకుంపేట మండలంలోని ఓల్డా పంచాయతీ కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గ్రామస్థులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని ఓల్డా పంచాయతీ కేంద్రానికి చెందిన భార్యాభర్తలు మజ్జి చిట్టిబాబు, అప్పలమ్మ సోమవారం కలిసి మద్యం సేవిస్తున్నారు. ఈ క్రమంలో వారి మధ్య స్వల్ప వివాదం తలెత్తడంతో భార్యపై చిట్టిబాబు కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె మెడపై గాయాలయ్యాయి. వెంటనే గ్రామస్థులు ఆమెను ఉప్ప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
Latest News