by Suryaa Desk | Tue, Dec 24, 2024, 03:16 PM
పార్లమెంటులో అంబేడ్కర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలూరు ఇన్‌చార్జి చిప్పగిరి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం అంబేడ్కర్ కూడలిలో కాంగ్రెస్, సీపీఐ, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
దేశానికి దిశానిర్దేశం చేసిన మార్గదర్శిని అవమానించేలా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణ కోరాలన్నారు. అనంతరం ఎస్‌ఐ దిలీప్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రామాంజినేయులు, లక్ష్మన్న, మంజు నాథ్, గోపాల్, ఎల్లప్ప, వెంకటేష్, మల్లేష్, మహేష్ జాన్ పాల్గొన్నారు.
Latest News