by Suryaa Desk | Tue, Dec 24, 2024, 03:20 PM
అనకాపల్లి జిల్లాలో రూ.లక్షా 50 వేల కోట్లతో స్టీలుప్లాంట్ నిర్మాణం జరగనున్నదని, దీంతోపాటు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు జనవరి 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జిల్లాకు వస్తారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు.
అనకాపల్లి-రాజమహేంద్రవరం మధ్య ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల జాతీయ రహదారిని త్వరలో ఆరు లేన్లకు విస్తరిస్తున్నామని, అనకాపల్లి-విశాఖపట్నం రహదారిని కూడా విస్తరించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో మూడు కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు.
Latest News