ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడే అద్భుత అవకాశం.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి
 

by Suryaa Desk | Tue, Dec 24, 2024, 07:58 PM

ప్రతీ ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్షా పే చర్చకు సమయం ఆసన్నమైంది. వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్న పరీక్షా పే చర్చ 2025కు సంబంధించి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. జనవరిలో నిర్వహించే 8వ ఎడిషన్ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు 6 నుంచి 12వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులు, టీచర్ల నుంచి దరఖాస్తులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. పరీక్షలు అంటే సాధారణంగానే విద్యార్థులకు ఎక్కడి లేని భయం ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. విద్యార్థులతో సమావేశమై.. వారికి సలహాలు, సూచనలు.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమమే పరీక్షా పే చర్చ.


ఈ నేపథ్యంలోనే వచ్చే నెల జరగనున్న పరీక్షా పే చర్చకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఆసక్తి కలిగిన స్టూడెంట్లు, వాళ్ల తల్లిదండ్రులు, టీచర్లు జనవరి 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నేరుగా మాట్లాడి, ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ https://innovateindia1.mygov.in/లో వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.


ఇక ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 14వ తేదీన రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. అయితే మంగళవారం ఉదయం 10 గంటల వరకు వరకు దేశవ్యాప్తంగా 9.72 లక్షల మంది విద్యార్థులు ఇందులో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీరితోపాటు 1.01 లక్షల మంది టీచర్లు.. 24,289 మంది తల్లిదండ్రులు రిజిస్టర్‌ అయినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు సదరు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చివరికి 2500 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ నుంచి పీపీసీ కిట్‌లు అందిస్తారు. పరీక్షా పే చర్చలో పాల్గొనేవారిని ఎంపిక చేసేందుకు https://innovateindia1.mygov.in/లో ఆన్‌లైన్ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలతో ఓ పోటీ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇక వచ్చే నెలలో ఢిల్లీలోని భారత్‌ మండపం టౌన్‌ హాల్‌లో పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షా పే చర్చ 2025కు సంబంధించి తేదీని ఇంకా కేంద్రం ప్రకటించలేదు.

Latest News
Change in guidelines might see Kerala BJP head getting another term Fri, Dec 27, 2024, 05:13 PM
ISL 2024-25: Chennaiyin FC aim to rebound in crucial home clash with Bengaluru FC Fri, Dec 27, 2024, 05:08 PM
Share of processed food goods in India's agricultural exports rises to 23.4 pc Fri, Dec 27, 2024, 05:08 PM
US Embassy in India breaks record, issues 1 million visas for second consecutive year Fri, Dec 27, 2024, 05:07 PM
South Korea: Parties split on constitutional court prospects after acting President's impeachment Fri, Dec 27, 2024, 05:06 PM