by Suryaa Desk | Tue, Dec 24, 2024, 10:49 PM
నేటి కాలంలో చాలా మంది హెయిర్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి, సరైన కేర్ తీసుకోకపోవడం, పోషకాహార లోపం ఇలాంటి సమస్యలతో చాలా మంది బాధపుడుతుంటారు.
అయితే చాలా మంది రోజ్‌మెరీని వారి హెయిర్‌కేర్‌లో యాడ్ చేస్తున్నారు. దీనికి కారణం అందులోని ప్రత్యేక గుణాలు జుట్టు సమస్యల్ని చాలా వరకూ పరిష్కరించడమే. అందుకే మార్కెట్లో కూడా కొన్ని రోజ్‌మెరీ ప్రోడక్ట్స్‌ని ఎక్కువగా అమ్ముతున్నారు.
బయట కొనే రోజ్‌మెరీ టానిక్స్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ బదులు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని వాడడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. దీనిని ఎలా తయారు చేయాలి, తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు..
ఉసిరిరోజ్‌మెరీవిటమిన్ ఇ ఆయిల్
ఇందులోని వాడే పదార్థాలన్నీ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి. చర్మాన్ని కూడా అందంగా మారుస్తాయి. వీటిని వాడడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి. ఉసిరిలోని విటమిన్ సి తలలో రక్త ప్రసరణని పెంచుతుంది. అంతేకాకుండా ఇందులోని పోషకాలు జుట్టు పెరుగుదలని పెంచుతాయి. దీనిని వాడడం వల్ల జుట్టు తెల్లబడడాన్ని తగ్గిస్తుంది.
జుట్టును ఒత్తుగా పెంచే చిట్కాలు
విటమిన్ ఇ..
విటమిన్ ఇ అనేది చర్మం, జుట్టు రెండింటికి అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని వాడడం వల్ల జుట్టు బలంగా మారి జుట్టు రాలడం తగ్గుతుంది. చర్మానికి వాడితే ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. దీనిని వాడడం వల్ల జుట్టుకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోండి.
రోజ్‌మెరీ..
ఇందులో కలిపి రోజ్‌మెరీ కూడా జుట్టుకి మేలు చేస్తుంది. జుట్టుని పెంచడంలో రోజ్‌మెరీ కీ రోల్ పోషిస్తుంది. చాలా హెయిర్ కేర్ ప్రోడక్ట్స్‌లోని దీనిని వాడుతున్నారు. ఇందులోని ఆల్కలాయిడ్స్, రోస్మెరికాడిస్, కార్నోయిక్ యాసిడ్ అన్నీ కూడా జుట్టు కుదుళ్లకి బలాన్ని అందిస్తాయి. ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుతుంది.
ఎలా తయారు చేయాలి..
ఈ హెయిర్ టానిక్ చేయడం చాలా ఈజీ ఇందుకోసం ముందుగా ఉసిరి ముక్కల్ని, రోజ్‌మేరీ ఆకుల్ని నీటిలో వేసి మరిగించాలి. దీంతో నీరు రంగు మారుతుంది. తర్వాత స్టౌ ఆఫ్ చేసి వడకట్టాలి. చల్లారిన తర్వాత విటమిన్ ఇ ఆయిల్ వేసి కలపాలి.
ఎప్పుడు రాయాలి..
ఇలా తయారైన హెయిర్ టానిక్‌ని రోజు రాత్రుళ్లు పడుకునే ముందు రాస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. రెగ్యులర్‌గా రాయడం అలవాటు చేసుకోండి. త్వరగా రిజల్ట్ ఉంటుంది. గమనిక:నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Latest News