చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం..
 

by Suryaa Desk | Thu, Dec 26, 2024, 02:03 PM

ఇటీవల కాలంలో యువతలోనూ గుండెపోటు సమస్యలు పెరుగుతున్నాయి. శీతాకాలం దీనికి ట్రిగ్గర్‌గా పనిచేస్తుంది. చలి వాతావరణం, ఒత్తిడి, అనారోగ్యకరమైన అలవాట్లు వంటి పలు కారణాల వల్ల శీతాకాలంలో గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. చల్లగా ఉన్నప్పుడు, శరీరం ఉష్ణోగ్రతను నిర్వహించడానికి రక్త నాళాలు అధిక శ్రమను అనుభవిస్తాయి. ఇది రక్తపోటు, హృదయ స్పందన రేటును పెంచుతుంది. ఇది గుండెకు రక్తాన్ని పంప్ చేయడానికి కష్టపడి పని చేస్తుంది. ఈ పరిస్థితి గుండె జబ్బులు ఉన్నవారికి మరింత కష్టం. ఒత్తిడి చలి పెరిగే కొద్దీ గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే చలిలో ధమనులు కుచించుకుపోయి ఇరుకుగా ఉండడం వల్ల బీపీ పెరిగి గుండెపై ఒత్తిడి తెస్తుంది. కాబట్టి చలికాలంలో గుండె జబ్బులతో పాటు గుండెపోటు కేసులు కూడా పెరుగుతాయి. సోమరితనం చలికాలంలో సాధారణంగా శారీరక శ్రమ తగ్గుతుంది. చలి కారణంగా మంచం దిగడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. ఆరు బయట నడవడం చాలా తక్కువ. ఈ బద్ధకం గుండెకు ప్రమాదాన్ని పెంచుతుంది. ఇంకా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న న్యుమోనియా రోగుల్లో గుండె ఆగిపోయే అవకాశం 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే, చలికాలంలోనే కాకుండా ప్రతి సీజన్‌లోనూ గుండెకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే గత 32 ఏళ్లలో గుండె జబ్బుల కారణంగా మరణించే వారి సంఖ్య 60 శాతం పెరిగింది. ఏటా 2 కోట్ల మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. కాబట్టి, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే 6-7 గంటలు నిద్రపోవాలి. దీనితో పాటు, ప్రతిరోజూ 30-40 నిమిషాలు యోగా చేయడం కూడా అవసరం. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండెకు ఇవి శత్రువులు అధిక బీపీ, ఊబకాయం, షుగర్, కొలెస్ట్రాల్, కీళ్లనొప్పులు, యూరిక్ యాసిడ్ వంటివి గుండెకు శత్రువులు. వీటివల్ల చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. రక్తపోటును పెంచుతుంది. గుండెపై ఒత్తిడి తెస్తుంది. 5 సంవత్సరాలలో గుండె జబ్బుల కేసులు 53 శాతం పెరిగాయి. యువతలో గుండె సంబంధిత సమస్యలకు క్రమరహిత హృదయ స్పందన అతి పెద్ద కారణం. నివారణ చర్యలు ఆహారంలో అవిసె గింజలు, వెల్లుల్లి, దాల్చిన చెక్క, పసుపు వంటి గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చే సూపర్‌ఫుడ్‌లను తీసుకోవాలి. బీపీ సమస్యను దూరం చేసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. సమయానికి ఆహారం తినాలి. జంక్ ఫుడ్ పూర్తిగా మానుకోవాలి. కనీసం 6-8 గంటలు నిద్రపోవాలి. ధూమపానం, మద్యపానం మానుకోవాలి. ఎందుకంటే ఇవే గుండెకు అతిపెద్ద శత్రువులు.ఆహారంలో కాకరకాయలను చేర్చుకోవాలి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.      

Latest News
South Korea: Rallies for, against Yoon's impeachment held 1 km apart Sat, Dec 28, 2024, 05:02 PM
Govt 'insulted' Manmohan Singh by performing his last rites at Nigambodh Ghat, alleges Rahul Gandhi Sat, Dec 28, 2024, 05:01 PM
Parbhani custodial death: Prakash Ambedkar demands solatium, survey of victims of police brutality Sat, Dec 28, 2024, 04:55 PM
Staying single in life can have economic, medical disadvantages: Study Sat, Dec 28, 2024, 04:54 PM
Adani Foundation steps in to support student battling kidney ailment Sat, Dec 28, 2024, 04:52 PM