by Suryaa Desk | Thu, Dec 26, 2024, 02:18 PM
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో గురువారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తో పాటు జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా, సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భూ సమస్యలపై ప్రజలు, రైతులు ఇచ్చిన అర్జీలను వారు స్వీకరించారు. ప్రజలు, రైతులు తెలిపిన సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు.
Latest News