by Suryaa Desk | Fri, Jan 24, 2025, 05:11 PM
సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్నీ పెట్టుబడులు వస్తున్నాయని ఏపీఎస్ ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి ఉద్ఘాటించారు. తండ్రి సీఎం అయినప్పటికీ మంత్రి నారా లోకేష్ సొంత కాళ్లపై నిలబడి ఎదిగారని తెలిపారు. విద్యా మంత్రిగా ఆ శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని చెప్పారు. ఏపీఎస్ ఎఫ్ఎల్‌కు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. సిస్కో, సహా పలు సంస్థలు ఫైబర్ నెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మందుకు వచ్చాయని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో ఫైబర్ నెట్‌లో ఉద్యోగులను నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా , అక్రమంగా నియమించారని ఆరోపించారు. ఏపీఎస్ ఎఫ్ఎల్‌లో మరో 200 మందిని ఉద్యోగులను తొలగించామని చెప్పారు.ఇప్పటి వరకు తొలగించిన ఉద్యోగుల సంఖ్య 600 కు చేరిందని అన్నారు. పారదర్శక విధానంలో ఉద్యోగాల నియామకాలు చేస్తామని స్పష్టం చేశారు. జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చి సమర్థత, అర్హత ఉన్నవారికే ఉద్యోగాలిస్తామని ప్రకటించారు. జగన్ ప్రభుత్వంలో కొందరు కేబుల్ ఆపరేటర్లపై రూ.100 కోట్లు పెనాల్టీలు వేశారని అన్నారు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రూ. 100 కోట్ల పెనాల్టీలను మాఫీ చేస్తున్నామని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో వినియోగదారులకు రెంటల్ పేరిట బాక్స్‌లు ఇచ్చారని అన్నారు. ప్రతి నెల ప్రతి కనెక్షన్‌కు రూ.59ల చొప్పున అక్రమంగా వసూలు చేశారని ఆరోపించారు. లోకేష్ జన్మదినం సందర్భంగా రెంటల్స్ వసూలు మొత్తాన్ని రద్దు చేస్తున్నామని అన్నారు.
Latest News