by Suryaa Desk | Fri, Jan 24, 2025, 05:15 PM
దివంగత మాజీ ఎంపీ, ఆదికేశవులుకు చెందిన బెంగళూరులోని ఇంట్లో భారీ చోరీ జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారి కుటుంబీకులు ఎస్పీ మణికంఠను కలిసి ఫిర్యాదు చేయడంతో ఈ విషయంలో బయటకు వచ్చింది. మూడ్రోజుల కిందట పెద్ద మొత్తంలో చోరీ జరిగిందని, ఇది చేసింది తమ ఇంట్లో పనిచేస్తున్న గంగాధరనెల్లూరుకు చెందినవారిగా ఆదికేశవులు కుటుంబీకులు గుర్తించారు. దీనిపై రెండ్రోజుల కిందట ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సంబంధిత సీసీ ఫుటేజీని కూడా అందించారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ స్థాయిలో ప్రత్యేకంగా పనిచేస్తున్న బృందాన్ని ఈ చోరీ విషయాన్ని తేల్చాలని ఎస్పీ ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే దొంగలు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో నిందితులను మీడియాకు చూపించే అవకాశం ఉంది.
Latest News