రాజమండ్రి విమానాశ్రయంలో ప్రమాదం
 

by Suryaa Desk | Fri, Jan 24, 2025, 05:29 PM

 రాజమండ్రి విమానాశ్రయంలోని నూతన టెర్మినల్ భవన నిర్మాణంలో ప్రమాదం చోటు చేసుకుంది. క్రెయిన్ వైర్ తెగి టర్మినల్ భాగం కిందపడింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఇటీవల నూతన టెర్మినల్ భవన నిర్మాణాలను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించిన విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజులకే నూతన టెర్మినల్ భవన నిర్మాణం వద్ద ఈ ప్రమాదం జరిగింది.రాజమండ్రి ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కొంత మంది కార్మికులు స్టీల్ స్ట్రెక్చర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక స్టీల్ స్ట్రక్చర్ కిందకు కూలిపోయింది. దీనిపై ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జ్ణానేశ్వరరావు ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టు నూతన టెర్మినల్ భవనానికి సంబంధించిన స్టీల్ స్ట్రక్చర్ కొంతభాగం నేలకొరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయని.. ఇది పెద్ద ప్రమాదమేమీ కాదని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ వెల్లడించారు.

Latest News
Vishwabandhu Bharat: India dispatches humanitarian aid to Kurdistan region of Iraq Mon, Jan 27, 2025, 04:46 PM
How can Padma award be given to Gaddar, asks MoS Bandi Sanjay Mon, Jan 27, 2025, 04:44 PM
Assam govt taking multiple initiatives to uplift education sector: CM Sarma Mon, Jan 27, 2025, 04:43 PM
To be recognised is truly special, says Bumrah on winning ICC Men’s Test Cricketer of the Year Mon, Jan 27, 2025, 04:29 PM
Sensex, Nifty slide over 1 pc amid weak global cues, US trade uncertainties Mon, Jan 27, 2025, 04:12 PM