నీళ్లు తాగే దమ్ముందా..: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు అఖిలేష్ యాదవ్ ప్రశ్న
 

by Suryaa Desk | Fri, Jan 24, 2025, 10:09 PM

యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ బీజేపీ తరఫున ఢిల్లీ ప్రచారానికి వెళ్లారు. ఈక్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీపై నిప్పులు చెరుగుతూ.. ఢిల్లీలోని యమునా నదిని డంపింగ్ యార్డులా మార్చారంటూ విమర్శించారు. ప్రయాగ్ రాజ్‌లో నేను స్నానం చేశాను, మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ యమునా నదిలో స్నానం చేయగలరా అంటూ కామెంట్లు చేశారు. దీనిపై ఆప్ అధినేత స్పందించకపోయినా అఖిలేష్ యాదవ్ స్పందించారు. యూపీ సీఎం పేరు ప్రస్తావించకుండానే.. స్నానం చేయడం కాదు మీ రాష్ట్రంలోని యమునా నది నీళ్లు తాగే దమ్ము మీకుందా అంటూ ప్రశ్నించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


గురువారం రోజు బీజేపీ తరఫున ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఈక్రమంలోనే బీపేజీ అభ్యర్థులకు ఓట్లు వేయమని కోరుతూనే.. వారు ఇచ్చిన హామీల గురించి వివరించారు. అలాగే ప్రధాన ప్రతిపక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. ముఖ్యంగా ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశిస్తున్నారని.. వారికి ఆమ్ ఆద్మీ పార్టీయే అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందంటూ ఆరోపించారు.


అలాగే ఢిల్లీని డంపింగ్ యార్డులా మార్చారంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు. ముఖ్యంగా యమునా నదిని మురుగు కాలువగా మార్చిన ఘనత ఆప్‌కే చెందుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా మహా కుంభమేళా సందర్భంగా మంత్రులతో కలిసి తాను ప్రయాగ్ రాజ్‌లో పుణ్యస్నానం ఆచరించానని స్పష్టం చేశారు. అయితే అర్వింద్ కేజ్రీవాల్.. ఇక్కడున్న యమునా నదిలో మునగగలరా అంటూ ప్రశ్నించారు. దీనికి ఆయన నైతికంగా సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.


దీనిపై ఆప్ అధినేత, పార్టీ అభ్యర్థులు ఎవరూ స్పందించకపోయినా.. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు ప్రస్తావించకుండానే.. గట్టిగా కడిగేశారు. ఇతరులను సవాలు చేసే ముందు యూపీలో పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలని హితవు పలికారు. మథుర నుంచి ప్రవహించే యమునా నది నీరు తాగేందుకు మీరు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Latest News
Don't end lives; file plaints as govt is with you: Karnataka CM assures people of action against microfinance firms Fri, Jan 31, 2025, 04:02 PM
Three victims of US plane crash ​​had Russian passports, identity of fourth being checked: Russian Foreign Ministry Fri, Jan 31, 2025, 03:59 PM
South Korea: Spy chief, top security adviser called to testify at Yoon's impeachment trial Fri, Jan 31, 2025, 03:57 PM
PNB reports strong Q3 FY25 results, net profit doubles Fri, Jan 31, 2025, 03:56 PM
Man Utd fan group believes rise in ticket prices is a 'death knell for fan culture' Fri, Jan 31, 2025, 03:51 PM