by Suryaa Desk | Sat, Jan 25, 2025, 11:28 AM
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హైవేలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలో మరో నేషనల్ హైవేకు సంబంధించి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 165 నేషనల్ హైవేలోని రెండో దశలో ఆకివీడు–దిగమర్రు వరకు నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయనున్నారు. అలాగే ఆకివీడు–వీరవాసరం మధ్యలో బైపాస్ విస్తరించనున్నారు. ఈ మేరకు అలైన్‌మెంట్‌కు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది.
Latest News