by Suryaa Desk | Sat, Jan 25, 2025, 12:14 PM
తిరుమల మొదటి ఘాట్ రోడ్డు లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ వాసులకు తీవ్ర గాయాలు అయ్యాయి.తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న ఓ కారు మొదటి ఘాట్ రోడ్డులోని 19వ మలుపు వద్ద ప్రమాదానికి గురైంది. శనివారం తెల్లవారుజామున స్కార్పియో వాహనం డివైడర్ ఢీ కొట్టి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తెలంగాణ కు చెందిన ఇద్దరు వ్యక్తులు గాయాల పాలయ్యారు. కారులో ఉన్న మరి కొందరు క్షేమంగా బయటపడ్డారు.ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్రమత్తు అయ్యి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Latest News