by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:20 PM
దేశంలో గ్రామీణ పౌరులకు సంబంధించిన ఆస్తుల విలువను ధ్రువీకరించి వారికి మేలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తికి రాష్ట్రంలో కొంతమంది సర్వేయర్లు తూట్లు పొడుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆస్తులకు వెలకట్టకపోవడం, ఆస్తులు కలిగి ఉన్నా సరైన రికార్డులు లేకపోవడం వంటి కారణాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందలేని పరిస్థితి ఉంది. ఈ కారణాలతోనే గ్రామాల్లో భూ వివాదాలు పెరుగుతున్నాయని కేంద్రం గుర్తించింది. అందుకే ప్రభుత్వమే గ్రామాల్లో ఉన్న ప్రతి ఆస్తిని గుర్తించి, దాని విలువను లెక్కించి దాని యజమానికి హక్కులు కల్పించేందుకు స్వమిత్వ (సర్వే ఆఫ్ విలేజెస్ ఆబాది అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్) పథకం ప్రవేశపెట్టంది. ఆ పథకం ద్వారా ప్రాపర్టీ కార్డును జారీచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అధునాతమైన డ్రోన్ టెక్నాలజీని వినియోగించి భూములను సర్వే చేసి, మ్యాపింగ్ చేస్తారు. ఈ కార్డుల ఆధారంగా ప్రజలు బ్యాంకు రుణాలు పొందేలా చర్యలు తీసుకుంటారు. ప్రజల ఆస్తులే కాకుండా గ్రామాల్లో ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఆస్తులను కూడా గుర్తిస్తారు.
Latest News