by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:24 PM
ముంబై మహానగరంలో పాకిస్థాన్ ఉగ్రవాదుల మారణహోమం తలుచుకుంటే ఇప్పటికీ భయంతో వణుకు పుడుతుంది. 2008 నవంబర్ 26న జరిగిన ముంబై దాడి యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.దాడి భయంతో ఎక్కడికక్కడ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 166 మందిని బలిగొన్న భయానక దృశ్యాన్ని నేటికీ ఆ దాడిలో బాధిత కుటుంబాలు మరిచిపోలేకపోతున్నాయి. నాటి ఈ ఘటనలో దోషిగా తేలిన పాకిస్థాన్ సంతతికి చెందిన ఉగ్రవాది తహవూర్ రాణాను భారత్‌కు తీసుకొచ్చేందుకు చేస్తోన్న ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు సమ్మతించింది.ముంబైలో 2008లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడిని భారతదేశానికి అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. తనను భారత్ కు అప్పగించకుండా అడ్డుకోవాలంటూ నిందితుడు తహవుర్ రాణా దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో రాణా దోషిగా తేలిన నేపథ్యంలో నేరస్థుల అప్పగింత నుంచి మినహాయింపు పొందలేడని స్పష్టం చేసింది. తహవుర్ రాణాను అప్పగించాలంటూ భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది. అయితే, రాణా కోర్టును ఆశ్రయించడంతో అప్పగింత వ్యవహారం వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే పలు కోర్టుల్లో వేసిన పిటిషన్లు కొట్టివేయడంతో చివరి ప్రయత్నంగా రాణా అమెరికా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తాజాగా సుప్రీంకోర్టు కూడా తిరస్కరించడంతో రాణాను భారత్‌కు అప్పగించడం ఖాయమని అమెరికా న్యాయ నిపుణులు చెబుతున్నారు.
26/11 ముంబై దాడితో సంబంధమున్న తహవుర్ రానాను త్వరలో భారత్‌కు తీసుకురావచ్చని తెలుస్తోంది. భారత్ – అమెరికా అప్పగింత ఒప్పందం ప్రకారం, అతనిని భారతదేశానికి పంపడానికి 2024 ఆగస్టులో అనుమతి లభించింది. తనను భారత్‌కు అప్పగించవద్దంటూ పలుమార్లు రానా అమెరికా కోర్టులను ఆశ్రయించాడు. చివరికి జనవరి 1న భారత్‌కు అప్పగిస్తూ అమెరికా సుప్రీంకోర్టు గట్టిగా ఆమోదించింది. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ జైలులో ఉన్నాడు.
పాకిస్థాన్ సంతతికి చెందిన తహవుర్ రానా ఐఎస్ఐ, లష్కరే తోయిబాలో సభ్యుడు. ముంబై దాడి ఘటనలో రానా కీలక పాత్ర పోషించాడని నిఘా వర్గాలు తేల్చాయి. లష్కరే తోయిబాలో చేరడానికి ముందు, తహవ్వూర్ పాకిస్తానీ సైన్యానికి వైద్యుడిగా కొనసాగాడు. అనేక యుద్ధాలలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన సైనికులకు చికిత్స చేశాడు.జనవరి 12, 1960లో జన్మించిన తహవుర్, పాకిస్తాన్‌లోని హస్నబ్దల్ జిల్లాలోని క్యాడెట్ కళాశాల నుండి వైద్య విద్యనుఅభ్యసించాడు. పాకిస్తాన్ ఆర్మీ నుండి పదవీ విరమణ చేసిన తరువాత, అతను కెనడా పౌరసత్వం తీసుకుని అక్కడికి వెళ్లి అక్కడ ఇమ్మిగ్రేషన్ వ్యాపారం ప్రారంభించాడు. 2011లో డెన్మార్క్ వార్తాపత్రిక కార్యాలయంపై దాడిలో లష్కరే తోయిబాకు మద్దతిచ్చినందుకు తహవుర్‌కు అమెరికన్ కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో 2013 జనవరి 17న, అక్కడి కోర్టు అతనికి 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే ఇప్పటి వరకు 26/11 ముంబై దాడుల ఆరోపణలపై తహవుర్‌ను దోషిగా నిర్ధారించలేదు.
తహవుర్, హెడ్లీ మొదట క్యాడెట్ కాలేజీ, హసన్ అబ్దుల్ మిలిటరీ కాలేజీలో కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ కాలేజీలో ఉన్నప్పుడు అసలు పేరు దావూద్ గిలానీ. రానా పాకిస్తాన్ మెడికల్ కాలేజీలో కెప్టెన్ జనరల్ డ్యూటీలో చేరాడు. అతను గట్టి పాకిస్తానీ. భారత వ్యతిరేక భావజాలం కలిగిన వ్యక్తి. రానా 1997లో పాకిస్థాన్ నుంచి కెనడాకు వెళ్లి అక్కడ 2011లో కెనడా పౌరసత్వం తీసుకున్నాడు. రానా ఫస్ట్ వరల్డ్ ఇమ్మిగ్రేషన్ పేరుతో ఒక కంపెనీని స్థాపించాడు. చికాగో, టొరంటో, న్యూయార్క్‌లలో దాని కార్యాలయాలను కూడా స్థాపించాడు. రానా ఒట్టావాలో తన తండ్రి, సోదరుడుతో కలిసి ఇంటిని కూడా నిర్మించుకున్నాడు. తహవుర్ తమ్ముడు అబ్బాస్ రానా కెనడాలోని “ది హిల్ టైమ్స్” వార్తాపత్రికలో పనిచేశాడు. పాకిస్తాన్ ఆర్మీలో మేజర్‌గా ఉన్న మేజర్ ఇక్బాల్‌తో టచ్‌లో ఉంటూ కెనడా, అమెరికా, భారతదేశం గురించి అంతర్గత సమాచారాన్ని రానా పంచుకునేవాడు.
ముంబై దాడులకు రానా ప్రధాన కుట్రదారుగా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. 26/11 దాడిని హెడ్లీ నుండి పూర్తి చేయడంలో, అది మేజర్ ఇక్బాల్‌ను చేరేలా చేయడంలో తహవుర్ రానా ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆ తర్వాతే దాడికి సంబంధించిన బ్లూప్రింట్ సిద్ధమైంది. హెడ్లీని ముంబైకి పంపించి, ఎక్కడ దాడి నిర్వహించాలనే బాధ్యతను రానాకు అప్పగించినట్లు సమాచారం. అంతే కాదు, హెడ్లీని ఎవరూ అనుమానించకుండా ఉండేందుకు, రానా ముంబైలో తన ట్రావెల్ ఏజెన్సీ బ్రాంచ్‌ను ప్రారంభించాడు. 2013లో రానా తన స్నేహితుడు హెడ్లీతో కలిసి ముంబయి దాడికి పాల్పడ్డాడని, డెన్మార్క్‌లో దాడికి ప్లాన్ చేసినందుకు దోషిగా తేలింది.రానా అభ్యర్థన మేరకు హెడ్లీ శివసేన భవన్, మాతోశ్రీ, కొలాబా, నారిమన్ పాయింట్, సిద్ధివినాయక్ టెంపుల్ వంటి ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించాడు. ఈ సమయంలోనే కలవాను కట్టిపడేసే ఆలోచన కూడా హెడ్లీ ఇచ్చాడు. దాడికి ముందు ఉగ్రవాదులు కాలవ ధరించి వచ్చినట్లు సమాచారం. విచారణ ప్రకారం, తాహవూర్ సలహా మేరకు హెడ్లీ పెద్దార్ రోడ్‌లోని ప్రసిద్ధ జిమ్‌లో చేరాడు. అందులో మహేష్ భట్ కుమారుడు ట్రైనర్‌గా ఉన్నాడు. హెడ్లీ తన స్నేహితుడిని కూడా చేసుకున్నాడు. తద్వారా పెద్ద మనషి ముసుగులో అతను ముంబైలో ఎక్కడికైనా వెళ్లేలా ఫ్లాన్ చేసుకసున్నాడు. 26/11 దాడుల కేసులో మహేష్ భట్ కుమారుడి వాంగ్మూలం కూడా తీసుకోవడం జరిగింది.
Latest News