by Suryaa Desk | Sun, Jan 26, 2025, 12:51 PM
చంద్రబాబు దావోస్ పర్యటన ఒట్టిదేనని తేలిపోయిందని.. ఒట్టి చేతులతో తిరిగి వచ్చారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ అన్నారు. ఒక్క ఎంఓయూ కూడా కుదుర్చోలేక పోయారని.. తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలు భారీగా పెట్టుబడులు తెచ్చుకున్నారన్నారు. దావోస్ పర్యటనపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎంగా చంద్రబాబు ఎందుకు ఒక్క ఒప్పందం కూడా చేసుకోలేదు? అని ప్రశ్నించారు. చంద్రబాబును చూసి ఒక్క పారిశ్రామిక వేత్త కూడా రాలేదు. పబ్లిసిటీ కోసం విపరీతంగా ఖర్చు చేసి చిన్న కంపెనీతో కూడా ఒప్పందం చేసుకోలేకపోయారు. తన తర్వాత సీఎం లోకేష్ అని ప్రచారం చేసుకోవటానికే దావోస్ పర్యటన ఉపయోగించుకున్నట్టుగా ఉంది. హైదరాబాద్ కంపెనీలతో చర్చించటానికి దావోస్ వెళ్లాలా?. దావోస్ పర్యటనకు పవన్ కల్యాణ్‌ని ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. 2016లో చంద్రబాబు 32 ఎంఓయూలు కుదుర్చుకుంటే వాటిలో 95 శాతం ఫేక్ అని తేలింది. 2017లో ఫిన్‌టెక్‌ని వైజాగ్ తెస్తున్నానని చెప్పారు. 2018లో అమరావతిలో స్కిల్ డెవలప్‌మెంట్ చేస్తానని చెప్పి చివరికి రూ.372 కోట్లు అదే కార్పొరేషన్‌లో స్కాం చేశారు. 2019లో పునరుత్పాదక ఇంధన శక్తి అన్నారు. ఇప్పుడేమో గ్రీన్ ఎనర్జీ అంటున్నారు. మధ్యలో 2019 -24 మధ్యలో వైయస్ జగన్ అదానీగ్రూపుతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును ప్రారంభించారు. ఓర్వకల్లులో నిర్మిస్తున్న గ్రీన్ కోని పవన్ కళ్యాణ్ కూడా చూసి అభినందించారు. అదీ వైయస్ జగన్ గొప్పతనమన్నారు. పోర్టులు, హార్బర్లు వైయస్ జగన్ హయాంలోనే నిర్మాణం జరిగాయని ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ పేర్కొన్నారు.
Latest News