by Suryaa Desk | Sun, Jan 26, 2025, 12:52 PM
దావోస్ నే ఇక్కడకు తెస్తానంటూ ప్రగల్బాలు పలికిన చంద్రబాబు.. మైదుకూరు వ్యక్తికి కోటు వేసి చర్చలు జరపారని వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వీళ్ల చేతగానితనానికి కూడా వైయస్ జగనే కారణమంటూ మాట్లాడటం విడ్డూరమన్నారు. ప్రజలందరికీ వీళ్ల చేతగానితనం, మోసం అర్థమవుతోందని, వైయస్ జగన్ ఉంటే బాగుండేదని ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు. శనివారం రవీంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన అనేది లేదని ఆయన విమర్శించారు. ఏపీలో ఎక్కడ చూసినా మహిళలపై దురాగతాలు, గంజాయి, పేకాట క్లబ్‌ల పాలనే సాగుతోందన్నారు. మట్టి నుంచి ఇసుక వరకూ దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు. ఇంతటి దుష్ట దుర్మార్గ పరిపాలన గతంలో ఎప్పుడూ చూడలేదని ఫైర్ అయ్యారు.
Latest News