by Suryaa Desk | Sun, Jan 26, 2025, 07:58 PM
నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డ్ వరించినందున తెలుగు వారికి, తెలుగు సినిమాకి, ఆయన కుటుంబ సభ్యులు.. ఇంకా నందమూరి అభిమానులందరికీ ఇదోక ముఖ్యమైన క్షణమని ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి అన్నారు. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డ్ రావడంపై స్పందించిన ఆయన మాట్లాడుతూ.. ఇది తన తండ్రి, గురువు, దర్శకుడు, విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ, నట రత్న, పద్మశ్రీ, లెజెండరీ ఎన్టీఆర్‌కు నిజంగా గర్వించదగిన క్షణమని అన్నారు. భారతీయ సినిమాకు, సమాజానికి నందమూరి బాలకృష్ణ సహకారం నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడారు. బాలకృష్ణ హీరోగా తన 50 ఏళ్ల ప్రయాణాన్ని జరుపుకున్న నేపధ్యంలో నందమూరి అభిమానులకు ఈ వార్త మరింత ఆనందాన్ని కలిగించిందని వైవీఎస్ చౌదరి పేర్కొన్నారు.ఈసారి తెలుగు వారికి 7 పద్మ అవార్డులు వచ్చాయని, పద్మభూషణ్ అవార్డు నందమూరి బాలకృష్ణకు రావడం హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అన్నారు. ‘భారతీయ సినిమాలో మీ ప్రయాణం నిజంగా అభినందనీయం... ఇతర ప్రముఖ తెలుగు, భారతీయ పద్మ అవార్డు గ్రహీతలకు అభినందనలు’.. అంటూ ఎస్ ఎస్ రాజమౌళి వ్యాఖ్యానించారు.
Latest News