గణతంత్ర దినోత్సవ వేడుకలు,,,,కేరళకు చెందిన గిరిజ రాజు రామన్ మన్నన్ హాజరు
 

by Suryaa Desk | Sun, Jan 26, 2025, 08:15 PM

ఢిల్లీలో జరుగుతోన్న 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య విదేశీ అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు, సామాన్యులను కూడా ఆహ్వానించారు. కేరళలో ఒకే ఒక్క గిరిజన రాజైన మన్నన్.. తన భార్య బినుమోల్‌తో కలిసి రిపబ్లిక్ డే వేడుకలు హాజరైన అనంతరం.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఫిబ్రవరి 2న వీరు కేరళకు చేరుకుంటారు.


రాజమన్నన్ దంపతుల ఢిల్లీ టూర్ ఖర్చులను పూర్తిగా కేరళ ప్రభుత్వం భరించనుందని మంత్రి కేలు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రత్యే సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ తల పాగా, సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు మంత్రులు, సైనికులు ఆయనకు సహాయం చేస్తారు.


కేరళ ఇడుక్కి జిల్లాలోని 48 స్థావరాలలో నివసిస్తున్న మన్నన్ గిరిజన తెగకు చెందిన 300 కుటుంబాలకు రాజమన్నన్ అధినేత. మన్నన్ సమాజం ఆచారాలు, ఉత్సవాలలో రాజుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. తండ్రి ఆర్యన్ రాజమన్నన్ చనిపోయిన తర్వాత 2012లో రామన్ ఈ రాజ్యానికి వారసుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆర్ధిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన రామన్ రాజమన్నన్.. ఓ సాధారణ రైతు మాదిరిగానే జీవనం సాగిస్తున్నారు. ఆయనకు రాజ భవనాలు, రథాలు లాంటి ఏమీ లేవు. ఒక సాధారణ ఇంట్లో నివసిస్తూ తన కుటుంబంతో కలిసి స్థానిక ఆలయాన్ని నిర్వహిస్తున్నారు.


రాజుకు పౌర సమాజంలో ఎటువంటి హక్కులు లేదా విధులు ఉండవు. కానీ నలుగురు సంస్థానాధీశులు, ఒక యువరాజు, కానిలు అని పిలువబడే 50 మంది మంత్రుల మండలి సహాయంతో తమ తెగకు సంబంధించి విషయాలను పర్యవేక్షిస్తారు. మన్నన్ సమాజం మాతృస్వామ్య వ్యవస్థను అనుసరిస్తుందని, అంటే మహిళలు వారసత్వ హక్కులను కలిగి ఉంటారని నివేదికలు చెబుతున్నాయి.

Latest News
Postpone Ayodhya visit for 15-20 days, Ram Temple Trust urges 'nearby' devotees amid huge rush Tue, Jan 28, 2025, 05:29 PM
Turkey detains 100 IS suspects across 24 provinces Tue, Jan 28, 2025, 05:10 PM
CM Mohan Yadav discusses investment opportunities in MP with delegates in Tokyo Tue, Jan 28, 2025, 05:09 PM
PM Modi inaugurates 'Utkarsh Odisha' business conclave in Bhubaneswar Tue, Jan 28, 2025, 05:08 PM
Fishermen arrested by SL Navy: AIADMK slams Stalin govt for failing to take up case Tue, Jan 28, 2025, 04:13 PM