హెచ్‌డీఎఫ్‌సీ నుంచి మరో కొత్త స్కీమ్.. రూ.100 ఉంటే చాలు!
 

by Suryaa Desk | Sun, Jan 26, 2025, 11:54 PM

హెచ్‌డీఎఫ్‌సీ నుంచి మరో కొత్త స్కీమ్.. రూ.100 ఉంటే చాలు!

మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? న్యూ ఫండ్ ఆఫర్ కోసం చూస్తున్నారా? అయితే మీకో మంచి ఆప్షన్ ఉంది. అత్యంత ఆదరణ పొందిన అసెట్ మేనేజ్మెంట్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్స్ మరో కొత్త ఫండ్ తీసుకొస్తోంది. అదే హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్ ఫండ్ . ఈ న్యూ ఫండ్ ఆఫర్ సబ్‌స్క్రిప్షన్ జనవరి 31వ తేదీ నుంచే మొదలవుతోంది. ఈ నెల తొలినాళ్లలోనే సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.


హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్ ఫండ్ అనేది ఒక ఓపెన్ ఎండెడ్ స్కీమ్. ఈ స్కీమ్ బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్ టీఆర్ఐ ఉంటుంది. మూడేళ్లు ఆపైన దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేసే వారికి ఇది సరైన ఎంపికగా ఏఎంసీ తెలిపింది. అయితే, ఇందులో వెరీ హై రిస్క్ ఉంటుందని వెల్లడించింది. ఈ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ జనవరి 31, 2025న మొదలై ఫిబ్రవరి 14, 2025 వరకు కొనసాగనుంది. ఈ పథకం ఫండ్ మేనేజర్లుగా నిర్మాన్ ఎస్ మొరాఖియా, అరుణ్ అగర్వాల్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్కీమ్ తమకు అనువైనదేనా అని తెలుసుకునేందుకు ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కలవాలని పేర్కొంది.


సబ్‌స్క్రిప్షన్ ముగిసిన తర్వాత వారంలో యూనిట్ల కేటాయింపు ఉంటుంది. ఆ తర్వాత యూనిట్ల కేటాయింపు ముగిసిన ఐదు పని దినాల్లో ఈ స్కీమ్ యూనిట్లు క్రయవిక్రయాలకు రిటైల్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ తెలిపింది. నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్ పనితీరు ఆధారంగా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ జనరేట్ చేయాలనే లక్ష్యంతో ఈ స్కీమ్ తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఓపెన్ ఎండెడ్ స్కీమ్ కావడంతో యూనిట్లు విక్రయించవచ్చు. లేదా రెడీమ్ చేసుకోవచ్చు. ఇందులో రెగ్యులర్, డైరెక్ట్ అని రెండు రకాల ప్లాన్లు ఉంటాయి. న్యూ ఫండ్ ఆఫర్ సమయంలో ఆ తర్వాత కూడా ఇందులో కనీస పెట్టుబడి రూ. 100గా ఉంది. ఆ తర్వాత రూ. 100 చొప్పున ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ కథనం సమాచారం కోసమే. ఎలాంటి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కాదు. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ హైరిస్క్ ఉంటుంది. సరైన అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. పూర్తిగా తెలుసుకున్నాకే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి.

Latest News
Special Olympics World Winter Games from March 7 to 17 in Italy Wed, Mar 05, 2025, 11:55 AM
JU ruckus: Agitating students to decide on next stage of protests today Wed, Mar 05, 2025, 11:52 AM
Trump gives shout-out to athlete injured by transgender girl Wed, Mar 05, 2025, 11:51 AM
Trump says he is 'working tirelessly' to end Russia-Ukraine war Wed, Mar 05, 2025, 11:50 AM
Tackling obesity not just personal concern but a national responsibility: Jitendra Singh Wed, Mar 05, 2025, 11:45 AM