|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 02:39 PM
అనారోగ్య కారణాలతో బాధపడుతున్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరులు, టిడిపి నాయకుడు శివప్రసాద్ అన్నారు.
మంగళవారం రేపల్లెలోని రెవెన్యూ మంత్రి కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఐదుగురికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నుండి మంజూరైన 4, 17, 753 రూపాయల చెక్కులను బాధితులకు అందజేశారు.