![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 11:43 AM
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఐదు మండలాల ఎంపిటీసిలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌తో కలిసి ఎంపీటీసీలు ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈనెల 27 వ తేదిన జరగనున్న ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ నేతలు కోరారు. అనంతరం ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ..... ఎర్రగొండపాలెంలోని మూడు మండలాల్లోని ఒక ఎంపీటీసి ఒక వైస్ ఎంపీపీ, ఒక కో ఆప్షన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి . త్రిపురాంతకం మండలంలో 18కి 18 మంది ఎంపీటీసీలు వైయస్ఆర్‌సీపీ వారే . ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లపాటు ఇద్దరికి ఇచ్చాం . ఒప్పందం ప్రకారం సుబ్బారెడ్డి దిగిపోయారు. ఆయన స్థానంలో ఆళ్ల అంజిరెడ్డికి కేటాయించాం. కుట్రలతో ఆళ్ల అంజిరెడ్డి స్థానాన్ని దక్కించుకోవాలని కూటమి నేతలు చూస్తున్నారు.
ఆళ్ల అంజిరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. కూటమి నేతల స్క్రిప్ట్ తో కేసులు నమోదు చేశారు. నిస్సిగ్గుగా వైయస్ఆర్‌సీపీ వారిని భయపెట్టి దక్కించుకోవాలని చూస్తున్నారు. ఒక్క స్థానం బలం కూడా లేకుండా కూటమి గెలవాలని చూస్తోంది. చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒక్క ఎంపీపీని కూడా గెలవలేరా... ఒక్క ఎంపీటీసీని కూడా గెలవలేరా ?నిజంగా రాజ్యాంగం పై నమ్మకముంటే ఏడాది తర్వాత వచ్చే ఎన్నికల్లో గెలవొచ్చుగా ?మీకు ధైర్యం లేదు కాబట్టే అక్రమ మార్గంలో గెలవాలని చూస్తున్నారు. మీకు ప్రజాబలం లేదు కాబట్టే ఈ తరహా తప్పుడు విధానాన్ని ఎంచుకున్నారు. ఏవిధంగా ఇక్కడ గెలవాలని చూస్తున్నారు. ఓసీ నాయకుల పై ఎస్సీలను ప్రయోగిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ఎన్నికల విధానాన్ని అందరూ ఖండించాలి.
ఎన్నికల కోసం వక్రమార్గాన్ని ఎంచుకోవడం దుర్మార్గం. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి . ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికలను నిఘా మధ్యలో జరపాలని కోరుతున్నా, ఎర్రగొండపాలెంలో జరుగుతున్న ఈ అరాచకాన్ని ఆపాలని కోరుతున్నాం. ఈ విధంగానే ఎన్నికలు జరిపేందుకే నోటిఫికేషన్ ఇచ్చారా ?రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిపే ధైర్యం లేదా మీకు ఎన్నికల్లో స్థానిక పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు. ఏ పోలీసు ఎవరిని బెదిరించారో మాదగ్గర ఆధారాలున్నాయ్?ఆధారాలన్నింటినీ ఎన్నికల కమిషనర్ కు ఇచ్చాం. కూటమి కుట్రలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు అని తెలిపారు.
Latest News