|
|
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 11:51 AM
పార్లమెంట్‌లో అరకు కాఫీస్టాల్ ప్రారంభోత్సవంకు ఏపీ నుంచి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, ఏపీకి చెందిన కొందరు ఎంపీలను ఆహ్వానించారు. స్టాల్ ప్రారంభించిన తరువాత స్పీకర్ సహా ఎంపీలు కాఫీని సేవించి, దాని రుచిని గురించి ప్రశంసించారు. ఈ సందర్బంలో స్థానిక అరకు ఎంపీని ఎందుకు ఆహ్వానించలేదని ఎవరూ ప్రశ్నించకపోవడం దారుణం అని ఎంపీ గొల్ల బాబురావు అన్నారు. గిరిజన మహిళ కావడం వల్లే ఆమెను అవమానించేందుకు ఆహ్వానించలేదా? వైయస్‌ఆర్‌సీపీ నుంచి గెలవడం వల్లే పిలవలేదా? పార్లమెంట్‌లోనే ఇటువంటి పరిణామాలు బాధాకరం అని అన్నారు.
Latest News