![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 12:09 PM
తిరుమల అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ పాపవినాశనం జలాశయం భక్తులకు పుణ్యస్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్నానం చేసి.. ఆ నీటిని తలపై చల్లుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అలాంటి పవిత్ర స్థలంలో ఏపీ ప్రభుత్వం అటవీశాఖ ఆధ్వర్యంలో మంగళవారం బోటింగ్ ట్రయల్ రన్ చేపట్టింది. అయితే పవిత్ర పాపవినాశనం డ్యాంలో బోటింగ్ ను ప్రవేశపెట్టాలన్న నిర్ణయం పట్ల భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమలను విహారయాత్రగా మార్చవద్దని భక్తులు కోరుతున్నారు.తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాల్లో పాపవినాశనం డ్యాం ఒకటి. ఈ నీరు పవిత్రమైనదిగా భక్తులు నమ్ముతారు. ఇక్కడకు వచ్చే భక్తులు ఈ నీటిలో స్నానం చేసి ఆధ్యాత్మిక శుద్ధిని పొందుతారు. అలాంటి ఈ డ్యాంలో బోటింగ్ సౌకర్యం ప్రవేశపెడితే ఇది ఒక తీర్థయాత్ర స్థలం కంటే విహార కేంద్రంగా మారే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం తిరుమల ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీస్తుందని, భక్తుల మనోభావాలను గాయపరుస్తుందని అంటున్నారు.
Latest News