|
|
by Suryaa Desk | Thu, Mar 27, 2025, 10:16 AM
గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తో తలపడి ఓటమి పాలైన వైసీపీ పార్టీ పార్టీలో కొన్ని ముఖ్యమైన పదవులకి నియామకాలలో మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను పార్టీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్, పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా శెట్టిపల్లి రఘురామిరెడ్డి, క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా రెడ్డి శాంతి, తానేటి వనిత, కైలే అనిల్, వై.విశ్వేశ్వరరెడ్డి నియమితులయ్యారు.
Latest News