లులూ గ్రూపు ఏర్పాటుకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
 

by Suryaa Desk | Thu, Mar 27, 2025, 10:41 AM

విశాఖపట్నంలో ఇంటర్నేషనల్‌ షాపింగ్‌ మాల్‌ ప్రాజెక్టు చేపట్టేందుకు లులూ గ్రూపు ముందుకు వచ్చింది. దీనిపై ఏపీఐఐసీకి ప్రతిపాదనలు సమర్పించింది. వాటిని పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో వీఎంఆర్‌డీఏ వద్ద ఉన్న 13.43 ఎకరాలను ఏపీఐఐసీకి వెనక్కి ఇవ్వాలంటూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2018లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు లులూ గ్రూపునకు కేటాయించిన భూములను వైసీపీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసి వెనక్కి తీసుకుంది. ఆ స్థలాన్ని ‘మిషన్‌ బిల్డ్‌ ఏపీ’ పేరుతో నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌బీసీసీ) ద్వారా వేలం వేయాలని ప్రయత్నించింది. దానిపై విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ భూములు విక్రయించవద్దని కోర్టు స్టే ఇచ్చింది. దాంతో జగన్‌ ప్రభుత్వం ఆ భూములు వీఎంఆర్‌డీఏకు బదలాయించి, ఆ సంస్థతో వేలం వేయించి సొమ్ము చేసుకోవాలని చూసింది. ఇదంతా 2024 ప్రారంభంలో జరగడం, ఆ తరువాత ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఆ భూములన్నీ వీఎంఆర్‌డీఏ వద్దనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని తిరిగి ఏపీఐఐసీకి వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Latest News
Bihar CM Nitish Kumar meets PM Modi in Delhi; discuss development and political issues Mon, Dec 22, 2025, 04:51 PM
Suryakumar Yadav to play two Vijay Hazare Trophy matches in Jan 2026 Mon, Dec 22, 2025, 04:45 PM
Coupang daily user count slips to 14 million range after data breach Mon, Dec 22, 2025, 04:43 PM
Rajnath Singh steers MoU between DRDO, Raksha University for R&D Mon, Dec 22, 2025, 04:42 PM
MP CM Mohan Yadav meets BJP Working President Nitin Nabin in Delhi Mon, Dec 22, 2025, 04:36 PM