![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 27, 2025, 10:47 AM
తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ‘గతంలో నేను కమ్యూనిజం లేదు క్యాపిటలిజం లేదు.. ఉన్నదల్లా టూరిజమేనని అన్నాను. కమ్యూనిజం లేదంటారా.. అని అప్పుడు నన్ను కమ్యూనిస్టులు తిట్టారు. నా ఉద్దేశం ఏమిటంటే టూరిజం వల్ల అభివృద్ధి జరుగుతుందని. నిన్న తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఖర్చులేని ఇజం టూరిజమని చెప్పారు. నా మాటలు అర్థం చేసుకోవడానికి వారికి 30 ఏళ్లు పట్టింది’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
Latest News