![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 27, 2025, 08:21 PM
గతేడాది కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధిత కుటుంబాల పునరావాసం కోసం సీఎం పినరయి విజయన్ మోడల్ టౌన్‌షిప్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి ఇప్పటివరకు ఆర్థిక సాయం అందలేదని వెల్లడించారు. పునరావాసం కోసం కేంద్రం తన మూలధన పెట్టుబడి పథకం నుంచి రూ.529.50 కోట్ల రుణం మంజూరు చేసిన విషయాన్ని విజయన్ ప్రస్తావించారు. కేంద్రంతో తమకు ఉన్న గత అనుభవాల నుంచి ఇంకేమీ ఆశించలేమన్నారు.
Latest News