![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 06:33 AM
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సీఐడీ కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ పై మంగళవారం నాడు ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని... బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీఐడీ తన వాదనలు వినిపించింది. వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నారని, మానవతా కోణంలో బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు.ఈ క్రమంలో తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి... కాసేపటి క్రితం తీర్పును వెలువరించారు. వంశీ బెయిల్ పిటిషన్ ను కొట్టివేశారు. వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కూడా తిరస్కరించారు.
Latest News